గిరిజన మహిళలను జైల్లో పట్టడంపై సిపిఎం నాయకులు ఆందోళన

Published: Tuesday June 07, 2022
జన్నారం రూరల్, జున్ 06, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గిరిజన మహిళలను జైల్లో పెట్టడం పై సిపిఎం నాయకులు స్థానిక కేంద్రంలో ఆందోళన నిర్వహించారు, విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడుతూ దండేపల్లి మండలం కోయపోశంగూడెంలోని మహిళలను జైల్లో పెట్టడం అమానుషమని సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంఖ్య రవి అన్నారు, దండేపల్లి  మండలంలో అదివాసి మహిళలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపండం సరికాదన్నారు, పోడు వ్యవాసాయం చేసుకుని జీవిస్తున్న మహిళలను శిక్షలు వేసి జైల్లో కి పంపండం తగదన్నారు, అదివాసిలకు భూ పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని వారు కోరారు, వారికి సిపిఎం పార్టీ మద్దతు ప్రకటిస్తున్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అశోక్, బుచ్చన్న, మామిడి విజయ్, తదితరులు పాల్గొన్నారు.