ఇనాం భూములను విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

Published: Thursday April 06, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల గల శివారులలోని భూములలో అక్రమ వ్యక్తులు వేసి పేద ప్రజలను మోసం చేస్తూ విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తరువాత డబ్బు సంపాదించాలని దురాశతో ఇనాం, బీడీపీపీ, వ్యవసాయ భూములలో అక్రమ వెంచర్లు వేస్తూ ప్లాట్లుగా చేసి బాండ్ పేపర్లపై అమ్మకాలను కొనసాగిస్తున్నారని అన్నారు. వీరికి స్థానిక అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, వారికి మరింత అవకాశం గా మారిందని తెలిపారు. ఆసిఫాబాద్, అంక్సాపూర్, ఎల్లారం, సాలెగూడా, భాగ్యనగర్, గోవింద్పూర్, గోడవెల్లి, శివారులలో అక్రమ దందాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,ఉన్నతాధికారులు,అక్రమ వెంచర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రాజకుమార్, నిఖిల్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.