గంగారం వినాయక లడ్డు వేలం పాట 46వేలు

Published: Friday September 09, 2022
మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పూడూరు దమయంతి వెంకటేష్
వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజా పాలన : నవరాత్రులలో నిత్య పూజలు అందుకున్న గణనాథున్ని భక్తులు భక్తి ప్రపత్తులతో కొల్చారని మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పూడూరు దమయంతి వెంకటేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పూడూరు దమయంతి వెంకటేష్ మాట్లాడుతూ వినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు మౌలిక వసతులతో పాటు భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా చూశామని పేర్కొన్నారు. వినాయక పూజాకైంకర్యాలతో పాటు మండపంలో నిర్వహించే కార్యక్రమాలను విజ్ఞంగా నిర్వహించామని స్పష్టం చేశారు. నేటి యువత దైవచింతనే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ భక్తి ప్రపత్తులతో కొలవాలని ఆకాంక్షించారు. మానవ మనుగడకు దైవచింతన పరమావధిగా నిలుస్తుందని గుర్తు చేశారు. మనిషి పుట్టుకకు సరైన మార్గం ఆధ్యాత్మిక చింతనే పరమావధిగా భావించాలని ఆకాంక్షించారు. వినాయక వినాయక చవితి రోజు నిర్వహించే పూజా కార్యక్రమాలతో పాటు విగ్రహ ప్రతిష్టాపన వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. యువతకు ఆదర్శవంతమైన జీవితం గడుపుటకు సాంస్కృతిక కార్యక్రమాలు హితోదికంగా తోడ్పడతాయని వెల్లడించారు. ప్రతి సాంస్కృతిక కార్యక్రమంతో యువతలో ఒక సంచలనాత్మకమైన గుణాత్మకమైన మార్పు వస్తుందని ఆశించారు. నేటి యువత సన్మార్గంలో నడవగలిగినప్పుడే దేశ ఆర్థిక అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు. వినాయక నిమజ్జనం కంటే ముందు రోజు వినాయక లడ్డు వేలం పాట ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సరం వినాయక లడ్డు వేలం పాటలో పాల్గొని 25 వేల రూపాయలకు దక్కించుకున్నానని తెలిపారు. ఈ సంవత్సరం వినాయక లడ్డు వేలం పాట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ 46వేలకు దక్కించుకొని సాంస్కృతి కార్యక్రమాలకు తోడ్పడుతానని హామీ ఇచ్చారు. వేలంపాటలో పాల్గొనగా వచ్చిన డబ్బులతో సాంస్కృతిక కార్యక్రమాలు దైవచింతనకు యోగించేలా కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ పూడూరు దమయంతి వెంకటేష్ కూతురు వైష్ణవి తల్లి లక్ష్మమ్మలతో పాటు పి కృష్ణ కిట్టు సి వెంకటేష్ నాగేష్ మానేయ నర్సింలు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు సి బ్రదర్స్ అండ్ బి బ్రదర్స్  ఎస్ కిష్టమ్మ కే లక్ష్మమ్మ లక్ష్మి తదితర భక్తులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area