గోవిందా పురం ఏ గ్రామంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

Published: Wednesday November 17, 2021
బోనకల్, నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో గ్రామ సర్పంచ్  బాగం శ్రీను వా‌సరావు అదర్వంలో గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద కరోనా వాక్సిన్ వేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోప్రజలకు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ 100% పూర్తి చేస్తున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించు కోకుండా ఉన్న వారు ఎవరైనా ఉంటే ఒకటో దశ మరియు రెండో దశ వ్యాక్సిన్ గ్రామ పంచాయతీ ఆఫీస్ కార్యాలయం నందు వేయించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, ఏఎన్ఎం  తిరుపతమ్మ మరియు ఆశా వర్కుర్ ఇస్రం దేవమణీ, గ్రామ పంచాయతీ వర్కర్ దార సురేష్, మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.