ఎన్.ఎస్.వి జూనియర్ కాలేజ్ బైపిసి మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంక్.

Published: Wednesday June 29, 2022
అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
 
జగిత్యాల, జూన్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని ఎన్.ఎస్.వి జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో  ఎన్. ఎస్.వి జూనియర్ కాలేజ్  బైపిసి మొదటి సంవత్సరంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ మరియు పలు ఉత్తమ ర్యాంకులు సాధించిన సందర్భంగా విద్యార్థులను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.