బతుకమ్మ పండుగ కానుక చీరలు పంపిణీ

Published: Friday September 30, 2022

జన్నారం, సెప్టెంబర్ 29, ప్రజాపాలన:  బతుకమ్మ పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బత్కమ్మ చీరలనం మండలంలోని చింతగూడ గ్రామంలో గురువారం  వైస్ ఎంపిపి సూతారి వినయ్ ఆద్వర్యంలో పంపిణీ చేశారు . సందర్భంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను ప్రతీ సంవత్సరం అడపడుచులకు  అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని కాష్మాండ అవతారంలో కొలంవై ఉన్న దుర్గదేవిని వైస్  దర్శించికోని పూజలు చేశారు. తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వకుండా శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యాక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు, తదితరులు  పాల్గొన్నారు.