కడెం ప్రాజెక్టు కు శాశ్వత పరిష్కారం చూపాలి టిడిపి అదిలాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి త

Published: Saturday August 20, 2022

జన్నారం, ఆగస్టు 19, ప్రజాపాలన: కడెం ప్రాజెక్టు కు శాశ్వత పరిష్కారం చూపాలని టిడిపి అదిలాబాద్ పార్లమెంట్ ప్రదాన కార్యదర్శి తాల్లపల్లి రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటివల కురిసిన భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు గేట్లు ద్వంసం అయినాయి. కడెం ప్రాజెక్టులో భారీ వరద వచ్చి వరద మహోగ్రరూపం దాల్చడంతో ప్రమాదకర స్థాయికి కడెం ప్రాజెక్టు పరిస్థితి ఏర్పడింది. వరద ప్రబావం వల్ల ప్రాజెక్టు రెండు గేట్లు పూర్తిగా ద్వంసం అయినాయి. కడెం ప్రాజెక్టు సామర్థ్యం కేవలం రెండున్నర క్యూసెక్కుల మాత్రమే, కానీ ప్రాజెక్టులో సుమారు అరున్నర క్యూసెక్కుల నీరు రావడంతో ప్రాజెక్టు పై నుండి సుమారు అరు అడుగుల నీరు ప్రవహించింది. అదృష్టావత్తు వరుణ దేవుడు కరుణించి శాంతిచండంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ వరద ఉధృతి అగకుంటే పెద్ద ప్రమాదం సంబంవించేది. దీనికి ప్రభుత్వం  నిర్లక్ష్యము కారణం ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వ్యవహరించి వుండే ప్రాజెక్టు గేట్లు ద్వంసం ప్రస్తుతం 18 గేట్లున్న ప్రాజెక్టు కు 50 గేట్లు పెంచినట్లయితే బవిషత్యలో ప్రాజెక్టులో సరిపడే నీటిని నిలువ చేసుకుని రైతులకు సరైన సమయంలో నీరందించి అవకాశం వుంటుంది. గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచినా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో టెండర్లు రద్దు చేసినారు. ఇప్పటికైనా కడెం ప్రాజెక్టు గేట్లు కు 50కి పెంచి నిర్మించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యాక్రమంలో ఉప్పులవిజయ్ ప్రధాన కార్యదర్శి, పులిశేట్టి శ్రీనివాస్ పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు.