మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందించాలి --- గట్టు వెంకటేశం ముదిరాజ్

Published: Tuesday November 22, 2022
చౌటుప్పల్ నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
మత్స్య సంపద దోపిడీ నివారణకు, మత్స్య సంరక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని తంగడపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గట్టు వెంకటేశం ముదిరాజ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మత్స్య పారిశ్రామిక సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గట్టు వెంకటేశం ముదిరాజ్ మాట్లాడుతూ మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధి ఏర్పాటు చేయాలన్నారు. మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బొలమోని రాములు, కార్యదర్శి చింతల గణేష్, కోశాధికారి చిత్రాల నరసింహ, సభ్యులు గట్టు లింగస్వామి, చొప్పరి శ్రీను, చింతల వెంకటేశం, కోలుకులపల్లి మమత, బోలమోని సుజాత, పెద్దమ్మ గుడి అధ్యక్షుడు పెద్దిగారి విగ్నేష్ ముదిరాజ్, కందుల పుల్లయ్య, బొలమోని వెంకటయ్య, బోలమోని శంకరయ్య, నక్క కిరణ్, రెడ్డమోని శివ, మత్స్య పారిశ్రామిక మహిళా మహిళా విభాగం అధ్యక్షురాలు నక్క ఈశ్వరమ్మ, సొప్పరి లావణ్య, బొలెమోని భవాని, బొలమోని మమత, గోదాటి పద్మ, బోలమోని భాగ్య, బొలమోని యాదమ్మ తదితరులు పాల్గొన్నారు