అధికార పార్టీ ధర్నా చేయడం సిగ్గు చేటు

Published: Wednesday April 13, 2022
కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి బిజెఆర్ కూడలి వరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్, గ్యాస్, కరెంటు చార్జీలు, బస్సు ఛార్జిలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని దెప్పిపొడిచారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను వెంటనే తగ్గించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ ప్రభుత్వం చాలా కాలం కొనసాగదని గుర్తు చేశారు నిత్యావసర ధరలు కూడా సామాన్యుని వంటలలో కుతకుతలాడుతున్నాయని వెల్లడించారు. నిరుద్యోగస్తులను మోసం చేసే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి ఆశల పల్లకి ఊరేగింపు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రత్నా రెడ్డి శివారెడ్డి పేట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్ చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.