కుల అభిమానం ఉండాలి కుల ద్వేషం ఉండకూడదు

Published: Friday January 06, 2023
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
మేడిపల్లి, జనవరి5 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ నియోజకవర్గంలోని మున్నూరు కాపులు తూర్పు కాపులు సంఘటితంగా ఒక్కటి కావాలని సూచిస్తూ కుల అభిమానం ఉండాలే కానీ కుల ద్వేషం ఉండకూడదని, సమాజంలోని అన్ని కులాలతో సమైక్యంగా ఉంటూ, కుల అభివృద్ధికి,సంక్షేమానికి మున్నూరు కాపులు కృషి చేయాలని హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. ఉప్పల్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం కన్వీనర్ గంధం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హబ్సిగూడ సుప్రభాత్ హోటల్లో మున్నూరు కాపు సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ,నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ పాల్గొని నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళ అభివృద్ధి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్,మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు ఆకుల లలిత,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, 
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మాజీ కన్వీనర్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సర్దార్ పూటం పురుషోత్తమ రావు, నగర అధ్యక్షులు ఆర్ వి మహేంద్ర ,బండి పద్మ,ఎడ్ల రవి,బండారి లత,జెల్లీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.