తెలంగాణ వ్యవసాయ కార్మిక సంగం మూడో మహాసభలను జయప్రదం చేయండి సిపిఎం పార్టీ

Published: Friday December 16, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.).
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర. 3వ మహాసభలు డిసెంబర్ 29 30 31న ఖమ్మం పట్టణంలో. జరుగుతున్న మాహసభలను జయప్రదం చేయాలని .సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పాల్గొని మాట్లాడుతూ
పెద్ద సంఖ్యలో జనాల్ని కదిలించాలని కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఒక గ్రామం నుండి ఇంటికో మనిషి ఊరుకో బండి కదిలించాలని  ఆయన అన్నారు 
 29న జరిగే బహిరంగ సభకు లక్ష మందితో బహిరంగ సభకు ప్రజల్ని కదిలించాలని
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన విపరీతమైన భారాలు మోపుతూ సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం. నిత్యవసర సరుకులు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
మతాలు కులాల తోటి ప్రజల్ని లౌకిక విధానం నాశనం చేస్తున్నారని. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని నిర్వీర్యం చేస్తుందని పార్లమెంటులో ఉపాధి పనికి బడ్జెట్కేటాయించట్లేదని బిజెపి ప్రభుత్వం దారుణంగా  అనుసరిస్తుందని.  తెలంగాణ ప్రభుత్వం పోడు చేసుకుంటున్నా పోడు రైతులకి పట్టాలు ఇవ్వాలని సమగ్రంగా సర్వే చేయాలని ఇంకా చేయని వారి కూడా సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని  వీటి అన్నిటి పైన.  బహిరంగ సభలో ప్రజలకి వివరించబోతున్న వ్యవసాయ కార్మిక సంఘం దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడే విధంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బహిరంగ సభ పెద్ద ఎత్తున జరగబోతుందని  ప్రజల పక్షాన పోరాటానికి అనేకమైన సమస్యలు ప్రజల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, ఎస్.కె  అబిదా, గుంటక కృష్ణ, శ్యామల అజయ్ కుమార్, కందుకూరి నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు