ఇప్పలనవేగాం ముదిరాజ్ గ్రామ అధ్యక్షుడిగా ఏట శంకర్ ** ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు సేర్ల మురళీధ

Published: Monday December 05, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి,చారి) : ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల నవేగాం గ్రామ ముదిరాజ్ అధ్యక్షుడిగా ఏట శంకర్ ను, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు సేర్ల మురళీధర్, మండల అధ్యక్షుడు పులి సతీష్, లు ఏట శంకర్ ను పలువురు  శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సెర్ల మురళీధర్ మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి, అధ్యక్షులను ఎన్నుకొని ముదిరాజుల ఐక్యతను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల ఉపాధ్యక్షుడు బోండ్ల రాజేష్, రవి, బాలేష్, మహేష్, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొని శంకరును పలువురు అభినందించారు.