డిసెంబర్ 31 వేడుకలు రాయికల్ మండల ప్రజ లు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి -- ఎస్సై కిరణ్ కుమార్ గ

Published: Saturday December 31, 2022

రాయికల్, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): డిసెంబర్ 31 రాత్రి మరియు 2023 ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని, ఈ వేడుకల్లో ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు సృష్టించకూడదని అలాంటి ఘటనలు జరిగితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వేడుకల పేరుతో మద్యం సేవించి రోడ్ల పైకి రాకూడదని, డీజే లు సౌండ్ బాక్స్ లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలగనీయకూడదని, యువత ఈ విషయాలను గమనించి ప్రశాంతగా వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి రోడ్ల పై కేక్ లు కట్ చేయకూడదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని, రోడ్లకు లకు బైక్ లు, కార్లు అడ్డుగా పెట్టి సెలబ్రేషన్ లు చేయకూడదని, మద్యం సేవించి వాహనాలు అతివేగంగా, అజాగ్రత్తగా నడపకూడదని, మైనర్లు వాహనాలు నడపకూడదని, ఎక్కువ శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు పెట్టి వాహనాలు నడపకూడదని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దు కుటుంబానికి బాధ ను మిగల్చకూడదని, నేరస్థుల మీద నిఘా పెంచటం జరిగిందని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయికల్ పోలీస్ శాఖ తరపున మండల, పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.