జీఎస్టీ ధరల పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

Published: Thursday July 21, 2022

కోరుట్ల, జూలై 20 (ప్రజాపాలన ప్రతినిధి):
కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరకులు అయినా పాలు పెరుగు బియ్యం వంటి ఆహార పదార్థాలపై 5% జిఎస్టి పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని, వెంటనే ఈ వ్యతిరేక విధానాలను ధరల పెంపులను వెనక్కి తీసుకొని ధరలు తగ్గించాలని లేనిపక్షంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తూ పేదల పైన పన్నులను విధించి సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపే  కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు నిరసన తెలుపుతూ కోరుట్ల పట్టణ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుట్ల ఆర్డిఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రైతు సమితి అధ్యక్షులు చీటీ వెంకటరావు, ఎంపీపీ తోట నారాయణ, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, కోరుట్ల టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్,మరియు ఇతర కౌన్సిలర్లు సర్పంచులు, ఉప సర్పంచులు కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.