హిమ్మత్ రావుపేట్ గ్రామంలో ఇంటింటికివెళ్లి కోవిడ్ వ్యాక్సినేషన్ ఆరోగ్యాశాఖ సిబ్బంది తో కలి

Published: Wednesday October 27, 2021

కొడిమ్యాల, అక్టోబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని హిమ్మత్ రావుపేట్ గ్రామంలో కరోనావ్యాధి రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ను సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా కృష్ణారావు  మాట్లాడుతూ కరోనా మూడోదశ రాకుండా ఆపేందుకు వ్యాక్సినేషన్ టీకా వేసుకోవడం ముఖ్యమని గ్రామంలో అందరూటీకా వేసుకొని గ్రామాన్ని వందశాతం వ్యాక్సినేషన్ గ్రామంగా చేయుటకు గ్రామప్రజలందరు సహకరించాలని మరియు వ్యక్తిగతశుభ్రత పాటించాలని, పౌష్టికఆహారం తీసుకోని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పునుగోటి కృష్ణారావు తో పాటు డాక్టర్ నవనీత, పంచాయతీ కార్యదర్శి పావని, ఏఏన్ఏం లు రాజశ్రీ, పద్మా, విఆర్ఓ గంగాధర్, వార్డు సభ్యులు, ఆశసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.