12వ డివిజన్ లో ఆధార్ కార్డ్ సెంటర్ ప్రారంభం

Published: Tuesday April 27, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కార్పొరేషన్ లోని పలు కాలనీ లో ప్రజలందరికీ ఆధార్ కార్డు లోని ఏమైనా తప్పులు ఉంటే సర్దిద్దటానికి ఆధార్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాలని వాసులందరికీ అందుబాటులో ఉందని కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లు అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో దండు కృష్ణ దంపతులు సమక్షంలో సోమవారం నాడు చింతలకుంట అంగన్వాడి సెంటర్ దగ్గర్లో (బడంగ్ పేట్ కమాన్) సమీపంలో ఆధార్ సెంటర్ ను కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్  లచే  ప్రారంభించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ లు మాట్లాడుతూ... బడంగ్ పేట్ కార్పొరేషన్ కు మీర్ పెట్ కార్పొరేషన్ కు మధ్యలో ఉన్నటువంటి  పలు కాలనీల్లో కాలనీవాసులు అందరికీ  అందుబాటులో ఈ ఆధార్ సెంటర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు లో తప్పు పేరుపడిన సరిదిద్దుకోవడం, కొత్త ఆధార్ కార్డులు కావాలనే వాళ్లకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన యజమానులకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ... కాళీ ప్రజలందరికీ ఆధార్ కార్డు సెంటర్ మనకు సమీపంలో ఓటు వచ్చే ప్రతి కాలనీవాసులు కరోనా ఈ పరిస్థితుల్లో మాస్క్తో, భౌతిక దూరం పాటించి ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రతి ఒక్కరూ సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు మోడల బాలకృష్ణ, బిజెపి ఎస్సీ మోర్చ శ్రావణ్ కుమార్, బిజెపి నాయకుడు మధు, కార్పొరేషన్ టిఆర్ఎస్ కార్పొరేటర్లు వేముల నరసింహ్మ, బీసీ సెల్ అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్, కాలనీవాసులు రాజు, మోహన్, ప్రసాద్, ఆధార్ సెంటర్  కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.