క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి

Published: Monday December 26, 2022

మధిర రూరల్ డిసెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి: క్రిస్మస్ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి  లింగాల కమల్ రాజు  కుటుంబ సభ్యులతో  మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు శ్రీమతి విద్యాలతా వెంకట్ రెడ్డిలు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ శాంతి కరుణ సహనం ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన యేసు క్రీస్తు బోధనలు శత్రువైన క్షమించే గొప్ప గూడెం గుణం సాటి మనుషుల్లో ప్రేమ పట్ల కరుణ సహనం అనే పదాలతో ముందుకెళ్లాలని  మధిర నియోజకవర్గ మరియు ఖమ్మం జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు