విద్యార్థి యువజన సంఘాల నాయకులపై తక్షణమే కేసులను ఎత్తివేయాలని డిమాండ్

Published: Friday July 08, 2022
విద్యార్థి యువజన సంఘాల నాయకులపై తక్షణమే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ 
 
కరీంనగర్ జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి :
శాంతియుతంగా ఆందోళన నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకుల పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గజ్జల శ్రీకాంత్  లు డిమాండ్ చేశారు. గురువారం నాడు
స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ‌ సందర్బ వారు మాట్లాడుతూ జమ్మికుంట లోని న్యూ మిలియన్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అఖిల అనే విద్యార్థిని చనిపోయిన సంఘటకు స్పందించి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని న్యాయం చేయాలని, మృతికి కారకులైన స్కూల్ చైర్మన్ తక్షణమే కేసులు పెట్టి న్యాయ విచారణ జరపాలని శాంతియుతంగా ఆందోళన చేసిన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకుల పై అనేక సెక్షన్ ల క్రింద పోలీసులు కేసులు నమోదు చేశారని వారు తెలిపారు. ఆదివారం పొద్దున చనిపోయిన విద్యార్థిని సోమవారం రాత్రి 9 గంటలకు పోస్టుమార్టం చేయడానికి గల కారణాలు తెలుపాలని వారు డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన విద్యార్థి ని యాజమాన్యం పైన కేసులు పెట్టకుండా న్యాయ విచారణ జరపాలని ఆందోళన చేసిన విద్యార్థి యువజన నాయకుల పై కేసులు పెట్టడాన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాయని వారు తెలిపారు. చనిపోయిన విద్యార్థిని గల కారణాలు నేటి వరకు తెలియకపోవడం దీని వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వారు అన్నారు. పాఠశాల యాజమాన్యం అధికార పార్టీ ఎంపీపీ కావడం వల్ల అధికార పార్టీ నాయకుల ప్రభలంతో అక్రమ కేసులు పెట్టారని వారు ఆరోపించారు. గౌరవ సిపి గారు న్యాయ విచారణ చేసి విద్యార్థి యువజన నాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని వారు కోరారు. విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి తక్షణమే శిక్ష పడే విధంగా చూడాలని వారు అధికారులను కోరారు.విద్యార్థి యువజన సంఘాల నాయకులపై తక్షణమే కేసులు వ్యక్తివెయ్యాలని న్యాయవిచరణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కేసులు ఉపసంహరించుకోకపోతే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉద్రిక్తం చేస్తామని వారు తెలిపారు. 
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి నగావత్ శ్రీనివాస్ నాయక్. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు రోహిత్ అరవింద్ నాయకులు ప్రవీణ్ అభిషేక్ సాయి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.