రాష్ర్ట ప్రభుత్వ దిష్ట బోమ్మ దగ్దం చెసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.

Published: Saturday March 20, 2021

మంచిర్యాల టౌన్, మార్చి19, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యం అవుతుంది. దానిని ప్రభుత్వం చేస్తుంది దీనికి నిదర్శనం రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు అని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా   ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో గత సంవత్సరం కంటే విద్యారంగానికి నిధులు తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి విద్యారంగానికి కేటాయించే కేటాయింపులు చూస్తే విద్యారంగం పట్ల టిఆర్ఎస్ చిత్తశుద్ధి అర్ధం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం విద్యరంగంకు నిధులు పెంచుతున్నాము అని బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం తప్ప ఆచరణలో ఖర్చు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ తన కలల ప్రాజెక్టు కెజీ నుండి పీజీ ఉచిత విద్య ఉసే ఈ బడ్జెట్లో లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం యూనివర్శీటీలను ద్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సంతోష్, నరేష్, ప్రవీణ్, సురేందర్, రెహమాన్, అంజి, ప్రదీప్, శ్రావణ్, అఖిల్, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.