మిలీనియం పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ సంబరాలు

Published: Tuesday November 15, 2022
మధిర నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్థానిక మిలియన్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగాఅన్నీ రంగాలలో ప్రతిభ చాటిన విద్యార్థులుప్రత్యేక ఆకర్షణగా విచిత్ర వేషాలుు మున్సిపాలిటీ పరిధిలో.మిలీనియం టాలెంట్ స్కూల్ నందు సోమవారం నాడు బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు విద్య ఆవశ్యకతపైవ్యాసరచన,డిబేట్,క్విజ్,జాతీయ నాయకుల వేషధారణ పోటీలు నిర్వహించడం జరిగింది.అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.తదుపరి పలు అంశాలలో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు,రాజేశ్వరి, టి. శ్రీనివాసరావు,సుశీల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు,పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.