ఎర్రుపాలెం మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వా

Published: Tuesday September 07, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రారంభోత్సవం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎర్రుపాలెం లో రైతు వేదిక ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అనంతరం జమలాపురం లో రైతు వేదిక ను, అనంతరం బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో రైతు వేదిక ను, బనిగండ్లపాడు గ్రామంలో రైతు వేదిక ను ప్రారంభోత్సవం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలు మంత్రి అజయ్ కి అందజేశారు. ముస్లింలకు స్మశాన వాటిక కోసం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇటీవల బనిగండ్లపాడు నుండి మైలవరం వెళ్ళు ప్రధాన రహదారిని గమనించ వలసినదిగా గ్రామ ప్రజలు చాలా రామకృష్ణ గ్రామ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి కోరారు. రోడ్డుకిరువైపులా సైడ్ డ్రైనేజ్ కావాలని వర్షం వస్తే ఆ నీరు ఇళ్లలోకి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత, గ్రామ సర్పంచులు, సొసైటీ చైర్మన్ లు, మహిళా అధ్యక్షురాలు, ఉమా మహేశ్వరి టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.