పల్లెల్లో భారతీయ జనతా పార్టీకి అద్భుత స్పందన వస్తుంది: కొండ హరీష్

Published: Monday March 07, 2022
బోనకల్, మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఎన్నారై, బిజెపి యువనేత బీపీ నాయక్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి భారతీయ జనతా పార్టీ జిల్లా సంఘటన మరియు విస్తారక్ ప్రముఖ్ కొండా హరీష్ పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కార్యకర్తల సమావేశం, కార్యకర్తల ఆత్మీయ పరామర్శలు, వ్యూహాలు ప్రతివ్యూహాలు పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా అనుసరించాల్సిన విధానాలు గూర్చి చర్చించడం జరిగింది. అలాగే పర్యటనలో పలు దేవాలయాలు సందర్శించి ఆధ్యాత్మికంగా కొంత సేపు గడపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, బోనకల్ గ్రామ అధ్యక్షులు గంగుల నాగయ్య, బీజేపీ యువ నాయకులు బీపీ నాయక్, గుగులోత్ నాగేశ్వరరావు, జంపాల రవి, తాళ్లూరి సురేష్, కారాంగుల మురళి, కాలసాని పరశురాం, మరీదు పరశురాముడు, ఏనుగు సుమన్ బాబు, రాజ్యలక్ష్మి, వెంకటరత్నం,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.