నూతనకల్లులో జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

Published: Wednesday April 06, 2022
తల్లాడ, ఏప్రిల్ 5 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, ఎస్ఎంసి చైర్మన్ చంద్రయ్య, నాయకులు తమ్మినేని పాపారావు, కళ్యాణపు వెంకటయ్య, మాజీ సర్పంచ్ శెట్టిపల్లి లక్ష్మణరావు, బలవంతపు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.