తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు పోషించిన పాత్రకు ప్రత్యేక స్థానం

Published: Friday June 03, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
 
మంచిర్యాల బ్యూరో, జూన్2, ప్రజాపాలన:
 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేయడంలో కవులు పోషించిన పాత్రకు ప్రత్యేక స్థానం ఉందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించు  కొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కవి నమ్మేళనం కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ స్ఫూర్తి అంశంపై కవి సమ్మేళన కార్యక్రమంలో 90 మంది కవులు సందర్భోచిత కవితా వచనాలను వినిపించారు. తెలంగాణ ఉద్యమ ప్రాశస్త్యం, పోరుబాటలో జిల్లా ప్రజలు పోషించిన పాత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు  తూ ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకుం  టున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కవి నమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎంతో గొప్పదైన తెలంగాణ భాషా సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని సాహితీవేత్తలు దశదిశలా చాటి జిల్లా ప్రతిష్టను ఇనుమడింప  జేయాలని  అన్నారు. అనంతరం 90 మంది కవులను శాలువా, ప్రశంసా పత్రంతో సన్మానించి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కవులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.