నిరుపేద కుటుంబాన్ని అందుకున్న సర్పంచ్ జాడి గంగాధర్

Published: Tuesday August 23, 2022
జన్నారం, ఆగస్టు 22, ప్రజాపాలన: మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జాడి రమేష్ అనే నిరుపేద గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య పద్మ, ఇద్దరు కూతుర్లు, హరిణి , అనూష, అనాధలుగా మిగిలారు. గ్రామంలో వారికి నిలువ నీడ లేకపోవడంతో, స్పందించిన గ్రామ సర్పంచి జాడి గంగాధర్ వార్డు సభ్యులు  వారికి ఇల్లు నిర్మించి సహయం చేయడానికి  ముందుకు వచ్చారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి నూతన గృహ నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి గంగాధర్ మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు పెద్దదికు కోల్పోవడంతో అనాధలుగా మిగిలిపోయారు. కనీసం ఉండడానికి నిలవ నీడ లేకుండా పోయిందన్నారు. వారి దీన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దాతలు, మానవతామూర్తులు, ముందుకు వచ్చి వారికి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జాడి వెంకట్, శ్రీనివాస్, శివాజీ, సుధాకర్, మృతుని భార్య పిల్లలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area