రాష్ట్రంలో రికార్డు స్తాయిలో పంట దిగుబ‌డి - ఎమ్మెల్యే డా.సంజ‌య్ కుమార్

Published: Friday April 23, 2021
జగిత్యాల, ఏప్రిల్ 23, ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల రురల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఐకెపి ప్యాక్స్ వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డా. సంజాయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి ఎక‌రాల మాగాణే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం రైతన్న‌ల కోసం పాటుప‌డ‌గ నేడు కోటిఎక‌రాలు దాటి కోటి 44 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌ దిగుబ‌డి సాధించటం దేశంలోనే తెలంగాణ ఒక రికార్డు అని అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మించుకున్నామ‌ని ప్ర‌తిపంట‌కు 14 వేల కోట్ల చొప్పున కేటాయిస్తూ రెండు పంట‌ల‌కు 24 వేల కోట్లను కేటాయించిందని అన్నారు. 39 ల‌క్ష‌ల రైతుల‌కు 2400 కోట్లను రైతు భీమాకు కేటాయించి దేశంలో ఏ రాష్ట్రంలో రైతు భీమా లేద‌ని రైతు సంక్షేమం కోసం పాటుప‌డుతున్న ఏకైక‌ రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 55 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రిధాన్యం సాగు చేస్తున్నార‌ని రెండ‌వ‌ స్తానంలో త‌మిళ‌నాడు నిలిచింద‌ని తెలిపారు. రైతు పండించిన ధాన్యం కొనుగోలుకై 20 వేల కోట్లను కేటాయించి అభ్యుద‌య రైతులున్న జ‌గిత్యాల జిల్లాలో వ‌రిపంట కాకుండ డ్రాగ‌న్  బొప్పాయి అర‌టి పందిరి సాగుల వైపు మొగ్గు చూప‌టం హ‌ర్ష‌నీయ‌మ‌న్నారు. ల‌క్ష్మిపూర్ గ్రామానికి 40 డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు గాను 2కోట్ల 20 ల‌క్ష‌లు మంజూరు అయ్యాయని స్తలం సేక‌రించుకోవాలని గ్రామ‌ స‌ర్పంచును కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి సందీప్ రావు నక్కల రవీందర్ రెడ్డి ఆత్మ చైర్మన్ ఏలేటి రాజీరెడ్డి సర్పంచ్ చెరుకు జాన్ ఏఎంసీ డైరెక్టర్ రాజిరెడ్డి ప్యాక్స్ డైరెక్టర్ రాజిరెడ్డి చంద్రరెడ్డి సత్తి రెడ్డి ప్యాక్స్ సీఈవో వేణు ఏపీఎం గంగాధర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.