కోదండరాం సారథ్యం లో అసంఘటిత రంగ కార్మికుల ఉధ్యమం.

Published: Monday October 11, 2021
సింగరేణి ఉద్యోగుల సంఘం కన్వినర్ గట్టన్న.
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 10, ప్రజాపాలన : జన సమితి వ్యవస్థాపకులు ప్రొపేసర్ కోదండరాం సారథ్యంలో కార్మికుల హక్కుల కోసం ఉధ్యమం కొనసాగుతుందని సింగరేణి ఉద్యోగుల సంఘం కన్వినర్ గట్టన్న పేర్కొన్నారు . ఆదివారం జిల్లా కేంద్రంలో అ సంఘటిత రంగ కార్మికులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు అనే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. శ్రమదోపిడికి గురవుతున్న కార్మికుల ను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డ్రైవర్స్, కార్మికులు,  హోటల్స్ కార్మికులు, పేంటర్స్, గృహనిర్మాణ కార్మికులు సత్యం నీరటిరాజన్న గోపాల్, రాజన్న మల్లేష్, శంకర్, రాజు మహేష్, చంద్రయ్య వినోద్ తదితరులు పాల్గొన్నారు.