ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

Published: Monday April 25, 2022
బోనకల్, ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సర్పంచ్ సైదా నాయక్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి పంచాయతీ రాజ్ చట్టం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ఏ రాష్ట్రంలో లేని విధంగా పంచాయతీలకు పెద్ద పీట వేస్తున్నారని, పారిశుద్ధ్యం నీళ్లు వీధిలైట్లు సిసి రోడ్ల నిర్మాణం హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ గ్రామ సభలో గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ పంచాయతీ సెక్రెటరీ దామళ్ళ కిరణ్, గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది రమేష్, నాగరాజు, గిరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.