ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై

Published: Monday August 01, 2022
31 : కుల మతాలకతీతంగా హిందూ- ముస్లిం సోదరులు జరుపుకునే మొహరం ఉత్సవాలు ప్రారంభం అయినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అబ్దుల్ లతీఫ్, ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బీ.గుల్షన్ ఆదివారం తెలిపారు. ఈ నెల 31 నుంచి పది రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మొహరం ఉత్సవాలు ఖతిబ్ ముజీబుర్ రహమాన్ ఆధ్వర్యంలో కొనసాగుతాయన్నారు. కొడంగల్ పట్టణంలోని జామే మజీద్ పక్కన గల హల్ సాబ్ పీర్ల మసీద్, ఇమామ్ ఖాసిమ్, అలీ అబ్బాస్, ఖూని అలావ్, అ లవ్ హుస్సేన్, అలీ అస్గర్, బారా ఇమామ్, పోలీస్ స్టేషన్ సమీపంలోగల హసేన్ హుస్సేన్ పీర్ల మసీదులలో పీర్ల ప్రతిష్ఠాపనతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగే మొహరం ఉత్సవాలకు భీమండి, కర్నాటక, మహారాష్ట్ర, బీదర్, అహ్మదాబాద్, సోలాపూర్, పూణే, తదితర ప్రాంతాల నుంచి కుల మతాలకతీతంగా హిందూ-ముస్లీం సోదరులు తరలివస్తారన్నారు. మెహరం ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని వారు కోరారు.