ఊరూరా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు.

Published: Thursday June 03, 2021

అమరవీరుల చిత్ర పటాలకు కఘనంగా నివాళులు.
జాతీయ పథకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నా  ప్రజాప్రతి నిధులు, వివిధ సంఘాల నేతలు.

మంచిర్యల జిల్లా, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జిల్లా ప్రజలు బుధవారం కోవిడ్ నిబంధనల పాటిస్తు నిరాడంబరంగా జరుపుతున్నారు. ఊరూరా తెలంగాణ, జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ లలో సర్పంచ్లు, మండలం కేంద్రాలలో వివిధ పార్టీల నాయకులు, కులసంఘాల ప్రతినిధులు, తెలంగాణ జెండాలు అవిస్కరించగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో...
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాల యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పల్లె భూమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీ యమని కొనియాడారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్గాలు అలుపెరు గని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైం దన్నారు. సమైక్య పాలనలో నిరాదర ణకు గురైన మెడికల్ కళాశాల మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే దివాకర్ రావుకు దక్కిందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణా సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎల్ల గజానంద్, సాబీర్ ఆలీ, కొత్త సురేందర్,  తిప్పని తిరుపతి. గరిసే భీమయ్య, అంకం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ కారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో...
ఉద్యమ కారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మి నగర్ కాలనీ లో తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 8వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికన్నా ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వరాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, సిహెచ్ రామస్వామి, కే శ్రీనివాస్, ఎమ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..
తిమ్మాపూర్ గ్రామంలో...
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడు జాడి గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మండల ప్రజలు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాస ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు తొలుత కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ సోనియాగాంధీ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పురుడుపోసుకుంది అని అన్నా రూ. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకోవడం సోనియా గాంధీని కలిచి వేసిందని ఆంధ్ర పాలకులు వ్యతిరేకించినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కల హేమలత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి, కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, నస్పుర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిళ్ళ వేణు, రెగుంట రమేష్, నాయకులు శ్రీరాముల మల్లేష్, నాంపల్లి శ్రీనివాస్, రామ్ మూర్తి, కొమురయ్య, మల్లయ్య, మహేశ్, పవన్, తిరుమల్, స్వామి, రాజారావు, కిష్టయ్య, పండుగ శ్రీను, షకీల్, యశోద, పద్మ తదితరులు పాల్గొన్నారు.