ఈదులకంటి రాకేష్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎంపీ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Published: Tuesday August 24, 2021
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిదిలోని దండుమైలారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సింగల్ విండో ఛైర్మన్ గా ఈదులకంటి రాకేష్ గౌడ్ విగ్రహన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ సోమవారం నాడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీలో ఎనలేని సేవలు అందించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఛైర్మన్ గా తన బాధ్యతను నిర్వహించారని ఆయన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయిందని భావోద్వేగం చెందారు. ఈదులకంటి రాకేష్ కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం రాకేశ్ గౌడ్ విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై, కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి,  జడ్పిటిసి ఉపతిగళ్ల మహిపాల్, ఈసీశేఖర్ మామ, మల్రెడ్డి అభిషేక్ రెడ్డి, కొండ్రు ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ఈదులకంటి రాకేష్ గౌడ్ అభిమానులు, బంధు మిత్రులు, కుటుంబ సభ్యులుకు తల్లిదండ్రులు ఈదులకంటి అరుణ చంద్రయ్య, ధర్మపత్ని ఈదులకంటి హర్షిత, కుమారుడు ఈదులకంటి (పండు) దేవాన్ష్, తమ్ముడు ఈదులకంటి వర్షిని నరేష్, హిమన్స్, రాకేష్ చెల్లెలు స్వప్న శేఖర్ గౌడ్, శాన్వి, రాకేష్  మేనమామలు. స్వామి గౌడ్, కృష్ణగౌడ్, రాజు గౌడ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.