వాటర్ మేనేజ్ మెంట్ విధానంపై అవగాహన..

Published: Saturday July 23, 2022
ఖమ్మం, జూలై 22 (ప్రజా పాలన న్యూస్): జనశిక్షణా సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం అర్బన్  రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ, బూడిదేంపాడు ఈర్లపూడి, కోయచలక గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగా వాటర్ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జనశిక్షణా సంస్థన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరు విధిగా వాటర్ రిసార్సెస్ ను ఎలా ఉపయెగించుకోవలలో, వేస్ట్ వాటర్ ను ఎలా ఉపయోగించాలో తగిన సూచనలను డైరెక్టర్ ఇచ్చారు.  అందరు ఆరోగ్యాంగా ఉండాలని, మనపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని తొలగించాలని,  మరియు యువత ఉద్వోగం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపదాలని, స్వయం శక్తితో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని డైరెక్టర్ వై రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమం లో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, సౌందర్య, భవాని, కవిత, రమేష్, రమాదేవి, యస్ కె. రజియా పాల్గొన్నారు.