పల్లె ప్రగతి వనాలలో పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలి

Published: Thursday March 18, 2021

సంబంధిత శాఖల న్యాయంతో వారం లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్


ఆసిఫాబాద్ జిల్లా, మార్చి17 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లాలోని అన్ని పల్లె ప్రగతి వనాలలో వారంలోగా మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఈ ఈ పిఆర్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వారం రోజుల లోగా అన్ని పల్లె ప్రగతి వనాలలో పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలని, జూన్ లోగా నర్సరీలలో 100% మొక్కల జర్నీ నేషన్ ఉండాలని, స్వయం సహాయ సంఘాల తర్వాతి సంవత్సరానికి నర్సరీ విత్తన సేకరణ చేయించడంతో పాటు వచ్చే సంవత్సరానికి గాను 70 లక్షల మొక్కల నర్సరీ లక్ష్యానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, నాటిన ప్రతి మొక్క బ్రతికే విధంగా వాటరింగ్ జరిగేల చూడాలని అన్నారు. ఈనెల 31లోగా స్మశాన  వాటికలు పూర్తిచేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లు మంజూరు చేయాలని, డ్రాయింగ్ ప్లాట్ పాములు పూర్తి చేయాలని, అన్ని సేగ్రి గేషన్ షెడ్ లను వాడుకలోకి తీసుకొని వస్తు, తడి, పొడి, వస్తువులను సేకరించి వాటి నుండి ఆదాయం వచ్చే విధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను సంబంధిత శాఖల సమన్యాయంతో పూర్తిస్థాయిలో పనులు చేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.