గ్రామంలో విద్యుత్ సమస్య ను పరిష్కరించే దిశగా సర్పంచ్

Published: Thursday December 01, 2022

బోనకల్: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో గత కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు విద్యుత్ సమస్యల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజలు గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్ కు పిర్యాదు చేయగా విద్యుత్ అంతరాయం తో ప్రజలు ఇబ్బంది పడకూడదని విద్యుత్ అధికారులని సంప్రదించగా వారి చొరవతో బుధవారం విద్యుత్ సమస్య తలెత్తకుండా గ్రామంలో విద్యుత్ అధికారులచే సమస్యను పరిష్కరించడానికి తను స్వయంగా విద్యుత్ అధికారుల వెంట ఉండి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాడు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పలు కార్యక్రమాలు చేస్తూ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని, బోనకల్ గ్రామం ఆదర్శ గ్రామంగా కావాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ విద్యుత్ సమస్యను పరిష్కారం చేసిన కృషికి గ్రామ ప్రజలు హర్షంవ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, జూనియర్ లైన్మెన్ రాజేష్, పంచాయతీ సిబ్బంది షేక్ దస్తగిరి,వార్డు ప్రజలు పాల్గొన్నారు.