ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 25

Published: Tuesday July 26, 2022

ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించి చట్టబద్ధత కల్పించాలని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు మొన్న జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై జరిగిన భౌతిక దాడిని నిరసిస్తూ నేడు కొడంగల్ నియోజకవర్గం స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ముందర నిరసన దీక్ష ఎమ్మార్పీఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి నడిమింటి మల్కప్ప అధ్యక్షతన జరుగుతున్న నిరసన దీక్షకు ముఖ్య అతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్ మాది గారు హాజరై మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో మొదటిసారి అధికారంలోకి రావాలని ఉద్దేశంతో అప్పటి కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు మరియు అప్పటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రధాని అభ్యర్థి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారిని గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారిని తీసుకెళ్లి కల్పించి మేము కనుక అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ సాధించి పెడతామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎనిమిదేళ్లు గడిచినా ఈ అంశంపై కనీసం పార్లమెంటులో ప్రస్తావన కూడా తేకుండా నీరు కరుచుతున్నటువంటి బిజెపి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉండడమే కాకుండా మొన్న జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మీరిచ్చిన హామీ ఏమైంది అని నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే భౌతిక దాడులు చేస్తారా ఖబర్దార్ బిజెపి కార్యకర్తలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గలిగిన మాదిగలు మాదిగ ఉపకులాలు దాదాపు 12% పైచిలుకున్న మేము మరి మమ్మల్ని కాదని మీరు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ఎలా తిరుగుతారో మేము చూస్తామని హెచ్చరిస్తూ మమ్మల్ని కాదని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏ కులాలకు ఏమి వంచన చేసి అధికారాన్ని సాధించుకుంటారో ఒక్కసారి మీరు గుర్తు చేయవలసిందిగా మీకు డిమాండ్ చేస్తూ ఇకనైనా మా న్యాయమైన డిమాండ్ను గుర్తించి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎస్. సోమశేఖర్ మాదిగ, కొనింటి నాగప్ప, పసుల సాయప్ప, హరీష్, వెంకటేష్, సురేష్, మల్లేష్, మహేష్, మధు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ సామాజిక ఉద్యమ నమస్కారాలతో నడిమింటి మల్కప్ప మాదిగ

MRPS నియోజకవర్గ ఇన్చార్జి

కొడంగల్.