పట్టణ ప్రగతి అంటే ఇదేనా ? బెల్లంపల్లి అక్టోబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలో

Published: Friday October 28, 2022
గురువారం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన పట్టణ 
 ప్రగతి పనులు ఏమిటో తెలపాలని,పట్టణ ప్రగతి అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
మునిసిపల్ కో ఆప్షన్ సభ్యుని ఇంటి వెనుక భాగంలో డ్రైనేజీ పైపు పగిలి  మురికి నీరంతా  బయట కి వరద లా పారుతున్నా,  ఈ మురికి, డ్రైనేజి నీళ్ళు సబ్ కలెక్టర్  కార్యాలయం ముందు నుంచి వెళుతున్నాయని, దుర్గంధంతో కూడిన వాసన వస్తుండడంతో సబ్ కలెక్టర్  కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
 పక్కనే సెయింట్ విన్సెంట్ పాఠశాల ఉందని, ఈ ప్రాంత నివాసులు, స్కూల్  కి వెళ్ళే చిన్న పిల్లలు సైతం ఈ డ్రైనేజి , మురికి నీళ్ళ లోంచే నడువవలసి  వస్తుందని తెలిపారు.
  ఈ ప్రాంతం లో నివసించే వారికి డ్రైనేజి మురికి నీరు, ఎప్పుడు నిలువ ఉందటంతో  దోమల బెడద అధికంగా వుందని, స్కూల్  పిల్లలకు మలేరియా, టైఫాయిడ్  జ్వరాలతో అనారోగ్యా లకు గురి అవుతున్నారని, ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం  నిలువ లేకుండా చేయలేకపోతున్నారని, పట్టణ ప్రగతి అంటే ఇదేనా వారు ప్రశ్నించారు.
ఇప్పటికైనా  వెంటనే మందమర్రి  సింగరేణి జనరల్ మేనేజర్ కానీ, బెల్లంపల్లి మునిసిపల్  కమిషనర్ కానీ  ఈ ప్రాంతాన్ని సందర్శించి డ్రైనేజి  మురికి కాలువ నీరును రోడ్లపై పారకుండా, నీటిని నిలువకుండా  చూడాలని వారన్నారు, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.