తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం ZPTC కామిరెడ్డి శ్రీలత.

Published: Monday October 10, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , బూర్గంపాడు మండలం ప్రజా పాలన.

తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు దేశానికే ఆదర్శమని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్నటువంటి రైతుబంధు, దళిత బంధు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ వంటి పథకాలు తెలంగాణలోనే కాకుండా దేశంలో నిర్వహిస్తే అద్భుతంగా ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతిన సాధించాయని అదే విధంగా కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని దేశ రాజకీయాలకు తీసుకొస్తే ఇలాంటి మరెన్నో అద్భుతమైన పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడతాయని కాబట్టి అలాంటి నేతను మనం దేశ రాజకీయాల్లోకి తీసుకురావాలని వారు ఈ ని సందర్భంగా తెలియజేశారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశంలో బిజెపి అవలంబిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు విపరీతమైన పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ధరలు పెంచి  బిజెపి ప్రభుత్వం పేదవాడి నడ్డి విరిచిందని కాబట్టి అలాంటి వారిని ఎంత దూరంగా పెడితే అంత మంచిదని వారు అన్నారు. మొన్నటికి మొన్న మనం రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని చూసుకుంటే బొగ్గు గనుల కాంట్రాక్టు కోసమే వారు బిజెపిలో కి వెళ్లారని అంతే తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని వారు అన్నారు. ఇకనైనా ప్రజలు మేల్కొని మునుగోడు ఎలక్షన్ లోనే కాకుండా వచ్చే ఎలక్షన్లలో కూడా కేసీఆర్ గారు లాంటి నేతని బిఆర్ఎస్ పార్టీని దేశ రాజకీయాలకు  తీసుకొస్తే పేద బడుగు బలహీన వర్గాలకే కాకుండా దేశాన్ని దేశంలో అద్భుతమైన ప్రకృతిని సాధించవచ్చు అని వారు అన్నారు.