వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Published: Monday May 02, 2022

కోరుట్ల, మే 01 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసంగి వడ్లు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు ఆదేశాల మేరకు ఐకేపీ ఆధ్వర్యంలో కోరుట్ల మండలంలోని ఐలాపూర్, ధర్మారం, తిమ్మయ్య పల్లి,యూసుఫ్ నగర్, గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యూసఫ్‌ నగర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, జెడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్‌ మరియు రైతు బంధు జిల్లా అధ్యక్షులు వెంకటరావుతో కలిసి స్థానిక సర్పంచ్‌, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల వడ్లు కొనుగోలు చేయమని మొండివైఖరి అవలంబించగా వడ్లుపండించిన రైతులు మోసపోవద్దని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వేసంగి ధాన్యాన్ని మొత్తము కొనుగోలు చేస్తామని ప్రకటించి దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరియు స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. రైతులు అందరు కూడా సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని మార్కెట్‌ లోకి తీసుకుని వచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ సురేష్‌ గౌడ్‌, సింగిల్విండో చైర్మన్‌ లు సాయి రెడ్డి, నర్స రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పిడుగు రాధా సంధయ్య, అంజయ్య, నాయకులు గోపిడి నరేందర్‌ రెడ్డి, స్థానిక వార్డు సభ్యులు మరియు తెరాస నాయకులు మహిళలు రైతులు పాల్గొన్నారు