కలెక్టర్ కు అంబేద్కర్ జయంతి ఆహ్వాన పత్రికను అందజేత

Published: Wednesday April 12, 2023

జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 11 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా సమీకృత సముదాయంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషాకు ఏప్రిల్ 14 శుక్రవారం రోజున నిర్వహించే డా: బీ.ఆర్. అంబెడ్కర్ జయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను కమిటీ కన్వీనర్లు బండ శంకర్ దుమాల రాజ్ కుమార్ కారంగుల కాంతారావు కాయితి శంకర్ చిత్తరి ప్రభాకర్ దళిత సంఘాల నాయకులు తదితరులు ఆహ్వానించారు.