నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అరికట్టండి ప్రజల ప్రాణాలను కాపాడండి

Published: Friday April 30, 2021

బెల్లంపల్లి, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మహారాష్ట్ర నుండి తెలంగాణ లోకి తరలిస్తున్న అక్రమ పొగాకు ఉత్పత్తుల రవాణాను మరియు స్థానికంగా తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని మహారాష్ట్ర తరలిస్తూ వ్యాపారాలు చేస్తున్న వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ ఐక్యకార్యాచరణ కమిటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ముఖ్యమైన పట్టణాల్లో నిషేధించిన పొగాకు ఉత్పత్తులు అంబర్, పూల్చాప్, విమల్, ఖైని, గుట్కాలను ఇక్కడ అమ్మకాలు చేస్తూ మరియు స్థానికంగా తయారు చేస్తున్న చీఫ్ లిక్కర్లను యదేచ్చగా మహారాష్ట్రకు తరలిస్తూ  తరలించిన మద్యాన్ని మహారాష్ట్రలో అమ్మకాలు జరుపుతున్నారని అధికార పార్టీ వారి అనుచరుల మద్యం షాపుల నుండి యదేచ్ఛగా అక్రమ మద్యాన్ని పంపుతూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని వీటిని అరికట్టాలని బెల్లంపల్లి ఐక్య కార్యాచరణ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో కర్ఫ్యూను ఆసరాగా చేసుకుని స్థానిక అధికార పార్టీ అనుచరుల మద్యం షాపుల నుండి వ్యాపారులు చీప్ లిక్కర్ను తయారు చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా  మద్యాన్ని విచ్చల విడిగా కూరగాయల వ్యాన్ లలో ఓన్ ప్లేట్ వాహనాల్లో తరలిస్తున్నారని అలాగే మెడికల్ స్టిక్కర్లు వేసిన అంబులెన్స్ ల్లోనూ కార్ లలోనూ మహారాష్ట్ర నుండి పొగాకు ఉత్పత్తులను తెలంగాణలోని పొరుగు జిల్లాలైన ఆసిఫాబాద్  బెల్లంపల్లి మంచిర్యాల గోదావరిఖని వరకు తరలిస్తూ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని బెల్లంపల్లి లోని సుగంధ ద్రవ్యాలు ఆమ్మే షాపుల్లోనూ, కాల్ టెక్స్లో ఉన్న రెండు షాపుల్లోనూ హోల్ సేల్ షాప్ ల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని ఈ షాపులపై దాడి చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారన్నారు, ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి బెల్లంపల్లి, తాండూర్, ఆసిఫాబాద్, వాంకిడిల వద్ద చెన్నూరు, వైపునుండి సిరివంచ, కోటపల్లి, మండలాల్లో, చెక్ పోస్టులు పెట్టి అక్రమంగా నడుస్తున్న వ్యాపారాల్ని అరికట్టాలని వారు కోరారు, ఈ అక్రమ వ్యాపారంలో వస్తున్న డబ్బులను అధికార పార్టీ నాయకులకు చందాల రూపంలోనూ పేపర్ యాడ్స్ రూపంలోనూ ఇవ్వడం వల్ల వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఈ అక్రమ వ్యాపారాల వల్ల ప్రజల ఆరోగ్యాలు చెడిపోయి మృత్యువు బారిన పడుతున్నారని ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని చీప్ లిక్కర్ వ్యాపారాన్ని, పొగాకు ఉత్పత్తులను అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో ఈ వ్యాపారాన్ని అరికట్టడానికి మూకుమ్మడిగా దాడులు చేయాల్సి వస్తుందని అఖిల పక్షం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో గెల్లీ జయరాం యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,గుండా చంద్ర మాణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి, బత్తుల మధు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అమానుల్లాఖాన్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, కాశీ సతీష్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు, గోగర్ల శంకర్, సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహమ్మద్ గౌస్, హెచ్ఎంఎస్ నాయకులు, ఆడెపు మహేష్ బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.