కార్మిక గర్జన పాదయాత్రను జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరణ

Published: Monday September 06, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం తుర్కయంజాల్ సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీ.ఓ లను వెంటనే జారీచేయాలనే ప్రధాన డిమాండ్లపై కార్మిక గర్జన పేరుతో ఈ నెల 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రారంభమై 30వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముగిసే ఈ పా ఇబ్రహీంపట్నం దయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో గల స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, యం. చంద్రమోహన్ లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, కార్మిక వర్గాన్ని యాజామాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందనీ వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు, పైగా కార్మిక వ్యతిరేక కోడ్లతో కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అదేవిధంగా ఆత్మగౌరవం పేరుతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కార్మికుల ఆత్మగౌరవంపై టీఆరెస్ ప్రభుత్వం దెబ్బకొడుతుందని అన్నారు. టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాల జీవోలను తొక్కిపెడుతున్నదని విమర్శించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చేసి ప్రతి కార్మికునికి నెలకు రూ.21వేలు కనీస వేతనంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులకు అర్థం చేయించేందుకు, వారిని సంఘటిత పర్చి పోరాడేందుకే కార్మిక గర్జన పేరుతో పాదయాత్ర సాగుతోందని  రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో ఈ నెల 8న ప్రారంభమయ్యే ఈ యాత్ర శంషాబాద్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, ఆర్సిఐ, తుక్కుగూడ మరియు ఆదిబట్ల ప్రాంతాల్లో తిరుగుతూ సెప్టెంబర్ 11వ తేదీన  తుర్కయంజాల్ చౌరస్తాకు చేరుకుంటుందని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సాయంత్రం 5 గంటలకు సభ ఉంటుందని తెలిపారు ఇక్కడి నుండి అబ్దుల్లాపూర్మెట్టు మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాకి వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిలా ఉపాధ్యక్షులు డి.కిషన్, డి.జగదీష్, జిల్లా కోశాధికారి ఎన్. మల్లేష్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.కవిత, సహాయ కార్యదర్శి బి.సాయిబాబు, బుగ్గరాములు, ప్రేమాజి తదితరులు పాల్గొన్నారు.