బుగ్గరాం మండల కేంద్రం లో రైతుబంధు ఉత్సవాలు.. : ఎంపీపీ బాదినేని రాజమణి

Published: Monday January 10, 2022

జగిత్యాల, జనవరి, 09 (ప్రజాపాలన ప్రతినిధి): బుగ్గరాం మండల కేంద్రంలో రైతుబంధు ఉత్సవాల్లో బుగ్గరాం మండల ఎంపీపీ బాదినేని రాజమణి పాల్గొన్నారు. ఎంపీపీ బాదినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనీ ఈ విషయాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పథకం లేదని అభినందించడం జరిగిందనీ  కేంద్ర ప్రభుత్వం కూడా గొప్ప పథకం గా భావించి రాష్ట్రాల్లో అమలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని, ఇలాంటి రైతులను ఆదుకునే గొప్ప పథకాలు చేస్తున్న ముఖ్యమంత్రి కి నియోజకవర్గ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఏర్పాటు అయిన బుగ్గరాం మండలాన్ని తెలంగాణరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వరన్న నాయకత్వంలో చాలా వరకు అబివృద్ది చేసుకున్నామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూల సుమలత-శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ జోగినిపెల్లి సుసెంధర్, ఎంపీపీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, రైతు బంధు మండల అధ్యక్షులు తాండ్ర సత్యనారాయణ రావు, టిఆర్ఎ స్ పార్టీ మండల అధ్యక్షులు గాలిపెల్లి మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు రైతులు, నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు అక్షయ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.