సూర్యగ్రహణంతో మూతబడిన దేవాలయాలు

Published: Wednesday October 26, 2022
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజా పాలన : సూర్యగ్రహణం కారణంగా మంగళవారం జిల్లా పరిధిలోని దేవాలయాలు మూతబడినవి. ప్రధాన అర్చకులు పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఆలయాల తలుపులు మూసివేశారు. మంగళవారం సాయంత్రం 4.59 గంటల నుండి 6.29 గంటల వరకు సూర్యగ్రహణం కొనసాగనున్నది. జిల్లాలోని వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ అనంతపద్మనాభ దేవాలయం తో పాటు బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎన్కతల గ్రామంలోని శనేశ్వర ఆలయం జుంటుపల్లి రాముల వారి గుడి తాండూర్ లోని భద్రేశ్వర దేవాలయం భూకైలాస్ కొడంగల్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయాలను ప్రధాన అర్చకులు ఆలయాల తలుపులు మూసివేశారు. బుధవారం ఆలయాలను శుద్ధిచేసిన అనంతరం భక్తులకు దైవదర్శనానికి అవకాశం ఉంటుంది.