కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరి గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి

Published: Wednesday September 07, 2022
ఎంఈఓ వై ప్రభాకర్ మధిర రూరల్ సెప్టెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడుమాటూర్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావు కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2022 లభించిన సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమా చార్యులు అధ్యక్షతన ముఖ్యఅతిది మండల విద్యాశాఖాధికారి వై ప్రభాకర్, గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, విద్యాకమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు ల ఆధ్వర్యంలో ఘనం సన్మానం జరిగింది. ఈసందర్భంగా యంఇఓ వై ప్రభాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల శ్రమ పైననే విద్యార్థుల భవిష్యత్ ఉంటుంది. అలా వారి బంగారు భవిష్యత్ కు నిరంతరం పాటుపడే శ్రీనివాసరావు లాంటి ఉపాధ్యాయులకు అవార్డులు తప్పనిసరిగా వస్తాయి అని పేర్కొంటూ మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి మాట్లాడుతూ జిల్లా స్థాయి బెస్ట్ టీచర్స్ మన మాటూర్ హైస్కూల్ లో పనిచేయడం మన గ్రామ అదృష్టంగా పేర్కొంటూ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు తీసుకొని రావాలని సూచించారు.
 ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు విద్యాకమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, కంచిపోగు ఆదాము,రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు వేము రాములు, భాణోత్ భావ్ సింగ్, పిఇటి రమాదేవి,పి లక్ష్మీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.