కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

Published: Friday October 08, 2021
సిలబస్ పూర్తి చేయకుండా పరీక్షలు ఎలా పెడతారన్న విద్యార్థులు
పరీక్షలపై  ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్07, ప్రజాపాలన : ఇంటర్ ప్రమోట్ అయినా మొదటి సంవత్సరం పరీక్షలపై ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చెఫట్టారు. ముందు గా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, విద్యార్థుల ఈసమస్యపై కలెక్టర్ కార్యాలయ ఏఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 25వ నుండి గత సంవత్సరం ప్రభుత్వం ప్రమోట్ చేసిన  ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైంటేబుల్ విడుదల చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా తీవ్ర రూపంలో విజృంభించడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో 2019-2020 విద్యా సంవత్సరం విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా 2020-2021 విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశారని ఐతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 1700 గేస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యూవల్ చేయలేదని, దింతో ప్రభుత్వ కాలేజీల్లో ఆన్లైన్ లో కూడా తరగతులు కూడా జరగలేదని పేర్కొన్నారు. లెక్చరర్ లేక పాఠాలు జరగక టీవీ పాఠాలు అర్థం కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ విద్యాసంస్థల ప్రారంభం ఐనప్పటికీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు ప్రారంభం కాలేదని అన్నారు. కానీ ప్రభుత్వం ఈ నెలలో పరీక్షలు పెట్టాలని షెడ్యూల్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ప్రారంభం కాకపోయినా, హాస్టల్స్ తెరవక పోయినా పరీక్షల పెడతామని ఇంటర్ బోర్డు మొండిగా పోవడం అంటే దేనికి కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూరడానికే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్, సమీర్, నాదీమ్, అభిషేక్, వర కృష్ణ, సురేష్, నవీన్, రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.