పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు కొరకు గడువు పొడిగింపు

Published: Tuesday October 26, 2021
జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి  పుష్పలత
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజాపాలన : 2021-2022 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల కోసం వికారాబాద్ జిల్లాలోని బీసీ, ఈ - బీసీ విద్యార్థుల నుంచి ఫ్రెష్ మరియు రెన్యూవల్ దరఖాస్తులు స్వీకరించడానికి ఈనెల 24 నుండి డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించడమైనదని జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పుష్పలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న ఫ్రెష్ మరియు రెన్యువల్ విద్యార్థినీ విద్యార్థులు వారి యొక్క వివరాలను ఈ-పాస్ వెబ్ సైట్ లో  నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 10% మంది విద్యార్థిని విద్యార్థులు మాత్రమే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కొరకు e-pass ద్వారా నమోదు చేసుకోవడం జరిగిందని, ఈ అవకాశాన్ని వికారాబాద్ జిల్లా బిసి, ఈ-బి సి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో తెలియజేసినారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్, యాజమాన్యం తమ కళాశాల విద్యార్థిని విద్యార్థుల వివరాలను త్వరతగతిన నమోదు చేయించే విధముగా తగిన చర్యలు చేపట్టాలని పుష్పలత బిసి సంక్షేమ శాఖ అధికారిని తెలియజేశారు.