దురాగతాలకు వ్యతిరేకంగా పొరాటం చేసిన మహనీయుడు* *బడగు బలహీన వర్గాలు అభివృద్ది ప్రదాత కొండా లక

Published: Wednesday September 28, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రభంజనం,మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ లో కలెక్టర్ అమోయ్ కుమార్ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...కొండా లక్ష్మణ్ బాపూజీ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోని క్వీట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గోన్నారని అన్నారు.నిజాం రజాకార్లు చేస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పొరాటం చేసారని,నగర పౌర హక్కుల కోసం ఉద్యమించారని,వాటి సాధనకు కమీటిలు ఏర్పాటు చేసారని,నాన్ ముల్కి ఉద్యమంలో చురుకుగా పాల్గోన్నారని,తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరహర దీక్ష చేసారని,ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు బడగు బలహీన వర్గాలు అభివృద్ది చేందాలని ఆశించారని అన్నారు.ఆచార్య కోండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మనమంతా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి విద్య, కలెక్టరేట్ ఉద్యోగులు,పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.