ప్రేంసాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Published: Monday October 18, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్17, ప్రజాపాలన : మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సమక్షంలో ఆదివారం సిపిఐ పార్టీ కి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాదించుకోవడం కోసం మాజీ ఎమ్మేల్సీ ప్రేంసాగర్ రావు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలలో ఉన్న అసంతృప్తి పరులను చేరదీసి కార్యకర్తలలో నూతనోత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలో గత నెలరోజులుగా నియోజకవర్గ పరిధిలో బారీ గా చేరికలు జరుగుతున్నవి. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ని పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో  సిపిఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు మంచిర్యాల మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు  కళావేన శ్యామ్ కుమార్ అలియాస్ కుమారస్వామి, సీపీఐ సీనియర్ నాయకులు రవి, రావుల కృష్ణమూర్తి తదితరులు వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఆయన  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం సీపీఐ లో నిబద్ధతతో పని చేసిన శ్యామ్ కుమార్, కృష్ణమూర్తి, రవి దాదాపు 200 మంది కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మేల్యే గా గెలిస్తే నియోజకవర్గమును ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పాత ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలో కాంగ్రెస్ అభ్య ర్థులు విజయం సాధించితీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి,మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య,నస్పూర్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్,మజీద్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్, దండేపల్లి జెడ్పిటిసి నాగరాణి త్రిమూర్తి,మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత,నస్పూర్ పట్టణ అద్యక్షురాలు అడెపు శ్యామల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు అర్కల హేమలత ,దండేపల్లి మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు,ముత్యాల శ్రీనివాస్,ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బానేశ్ , నాయకులు కొండ శేఖర్, శ్రీపతి మల్లేష్ ,ఖాలీద్,పుదరి ప్రభాకర్,వీరా చారి,రామ్మూర్తి,మహేష్ ,రాజు,కిష్టయ్య,రాజేశ్వరి, ఇతర నేతలు పాల్గొన్నారు.