సమస్యల పరిష్కార లక్ష్యమే శుభోదయం కార్యక్రమం

Published: Saturday November 19, 2022
చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య
వికారాబాద్ బ్యూరో 18 నవంబర్ ప్రజాపాలన : సమస్యల పరిష్కార లక్ష్యమే శుభోదయం కార్యక్రమాన్ళి తేపడుతున్నామని చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం  నవాబుపేట్ మండలం నారేగూడ, పూలపల్లి గ్రామలలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి ఆధ్వర్యంలో నారేగూడ గ్రామ సర్పంచ్ గంగ్యాడ పర్మయ్య, పూలపల్లి గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి ల ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరించి పల్లెల్లో వెలుగులు నింపేందుకే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే  యాదయ్య తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కలిసి పర్యటించి  అనంతరం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.  గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నదని మిషన్ భగీరథ రైతుబంధు, రైతు బీమా ,కల్యాణ లక్ష్మి షాది ముబారక్, దళిత బంధు వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు. పూలపల్లి గ్రామంలో 30లక్షల రూపాయలతో సీసీ రోడ్డు రిటర్నింగ్ వాల్ నిర్మాణ  కార్యక్రమానికి శంఖు స్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాలే భవాని, జడ్పీటీసీ కాలే జయమ్మ, పిఏసిఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసి చైర్మన్ ప్రశాంత్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ విఠల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.