మొక్కల పంపీణీ కార్యక్రమన్ని చేపట్టిన సర్పంచ్

Published: Thursday July 14, 2022

బోనకల్ జూలై 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ పంచాయతీ నర్సరి లో పేంచిన గులాబి, దానిమ్మ, జామా, ఉసిరి, బాత్తాయి, బోంపాయి, మందారం, పలురకాల పూల మొక్కలను ఇంటి ఇంటికి ఆరు మొక్కలను పంపీణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తీసుకున్నా మొక్కలను ఇంటి లో నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి పరశురామ్, పంచాయతీ సిబ్బంది, మొక్కల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.